లాక్‌డౌన్ కట్టుదిట్టంగా పాటించడం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలకు తాళలేక ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు కొట్టడంతోనే అతడు చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన గౌస్‌కు పెళ్లయి ఇద్దరు చిన్న పిల్లలున్నారు.  శుభవార్త.. మీ PF రెట్టింపు అవుతుంది!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీ నివాసి మహమ్మద్ గౌస్ (28) ఉదయం ఎనిమిదన్నర గంటల ప్రాంతంలో మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు కొనుగోలు చేశాడు. అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అతడ్ని ఆపారు. లాక్‌డౌన్‌లో బయటకు ఎందుకు వచ్చావంటూ కొట్టారు. పోలీసుల దెబ్బలకు తాళలేక గౌస్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మహమ్మద్ గౌస్ చనిపోయాడు. ఉదయం 6 నుంచి 9 గంటల సమయం వరకు నిత్యావసరాలు, మెడిసిన్ కొనుగోలు చేసేందుకు అనుమతి ఉందని, మందుల కోసం వెళ్లిన వ్యక్తిని ఎలా కొట్టారంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే గౌస్ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’పై సర్వేలో షాకింగ్ విషయాలు!


గౌస్ మరణించిన ఘటన ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. గౌస్‌ను పోలీసులు కొట్టలేదని, బయట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తున్న సమయంలో గౌస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని ఐజీ ప్రభాకరరావు తెలిపారు. గతంలోనే అతడికి గుండె సంబంధిత సమస్యలు ఉన్న గౌస్ భయాందోళనకు గురికావడంతో గుండెనొప్పి వచ్చిందన్నారు. పోలీసు శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. గౌస్ మరణానికి కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!      జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos